హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హేమంత్‌కు పోలీసుల మరో షాక్

ATP: రాప్తాడు దాడి నిందితుడు హేమంత్‌కు పోలీసుల మరో షాక్ తగిలింది. బాలికపై ఎలక్ట్రిక్ రంపంతో దాడి చేస్తున్న సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన మరో దళిత బాలిక గాయపడిన విషయం తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు రాప్తాడు పోలీసులు హేమంత్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. దీంతో నిందితుడిపై కేసుల తీవ్రత మరింత పెరిగింది.