హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి!

NLG: ఇందల్వాయి(M) సిర్నాపల్లిలో విషాదం జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. బుధవారం సాయంత్రం కల్లు గీత కార్మికుడు కిషోర్ గౌడ్ ప్రమాదవశాత్తు తాటిచెట్టు పైనుంచి జారిపడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం అందుకున్న ఇందల్వాయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.