PDPL: రైతులకు పశుగ్రాసం పెంపకం, షెడ్లు, నీటి తొట్టెల నిర్మాణం కోసం VBGRAMG పథకం కింద ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని నంది మేడారం పశు వైద్య ఉపకేంద్రం విఎల్ఓ ఇబ్రహీం షరీఫ్ తెలిపారు. పూర్తి సబ్సిడీపై సహాయం అందించబడుతుందని అన్నారు. ఆసక్తి గల రైతులు అన్ని పత్రాలతో ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలని సూచించారు.
తెలంగాణ
'పశుగ్రాస అభివృద్ధి పథకానికి దరఖాస్తులు'


