హైదరాబాద్: 28°C
తెలంగాణ

సాగర్ SE, EEలకు షోకాజ్ నోటీసులు

NLG: నాగార్జునసాగర్ కుడివైపు ఏపీ చేపట్టిన నీటి తరలింపు పనుల వ్యవహారం తెలంగాణ నీటిపారుదల శాఖలో కలకలం రేపింది. ఈ ప్రాజెక్టు పనులపై ప్రభుత్వానికి సమాచారం ఇవ్వలేదని సాగర్ SE, EEలకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏపీ ప్రభుత్వం రూ.1,200 కోట్లతో 3 ఇంటెక్వెల్స్, 200 ట్యాంకులను నిర్మిస్తూ 1.86 TMCల నీటి తరలింపు పనులు చేపట్టింది.