హైదరాబాద్: 28°C
తెలంగాణ

బినామీ రేషన్ డీలర్ దందా?

WGL: ఖిలా వరంగల్ మండలం మామూనూరులో రేషన్ దుకాణం నంబర్ 4318061 నిర్వహణపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహిళ పేరు మీద ఉన్న దుకాణాన్ని ఆమె భర్త నిర్వహిస్తున్నారని, కిరాణా దుకాణంలో రేషన్ పంపిణీ చేస్తూ ఇతర సరుకులు కొనాలని లబ్ధిదారులపై ఒత్తిడి తెస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనపై ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరపాలని రేషన్ లబ్దిదారులు పేర్కొన్నారు.