హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం సభకు భారీగా తరలిరావాలి: నీలం మధు

SRD: సిద్దిపేటలో ఇవాళ జరిగే ముఖ్యమంత్రి సభకు ప్రజలు భారీగా తరలిరావాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌ఛార్జి నీలం మధు ముదిరాజ్ పిలుపునిచ్చారు. మంత్రి దామోదర రాజా నరసింహ, పూజల హరికృష్ణతో కలిసి సభా స్థలాన్ని పరిశీలించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్, ట్రాఫిక్ ఏర్పాట్లపై శ్రేణులకు సూచించారు. సభ విజయవంతానికి సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.