హైదరాబాద్: 28°C
తెలంగాణ

మ్యూజియంలో కలాం విగ్రహం కోరిక

NRPT: కోస్గిలో ఏర్పాటు చేసిన సైన్స్ మ్యూజియంలో మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం విగ్రహాన్ని నెలకొల్పాలని ఎంఐఎం మండల అధ్యక్షుడు అంజద్ ఖాన్ కోరారు. ఇవాళ విలేకరులతో మాట్లాడుతూ, మ్యూజియంలో పలువురు శాస్త్రవేత్తల చిత్రపటాలు ఉన్నా కలాం చిత్రం లేకపోవడం బాధాకరమన్నారు. కొడంగల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి తిరుపతిరెడ్డి చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.