KNR: వీణవంక మండలంలో అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టారు. బుధవారం కొండపాక గ్రామ శివారులోని వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఎస్సై ఏ. తిరుపతి పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ట్రాక్టర్ డ్రైవర్ రాకేశ్, యజమాని రాజుపై కేసు నమోదు చేశారు. అక్రమ ఇసుక రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.
తెలంగాణ
అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల చర్యలు.. ట్రాక్టర్ పట్టివేత


