హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మీనాక్షి మృతిపై సమగ్ర విచారణకు డిమాండ్

అల్లూరి: అరకులోయలో ఐటీఐ విద్యార్థిని మీనాక్షి మృతి ఘటనపై బంధువులు, కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డుంబ్రిగుడ మండలం గాంధ గ్రామానికి చెందిన పవన్ అనే యువకుడితో తన కుమార్తెకు పరిచయం, ప్రేమ వ్యవహారం ఉందని, అతడిపై అనుమానం ఉందని మృతురాలి తండ్రి పేర్కొన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.