GDWL: జూరాల ప్రాజెక్టులో ప్రస్తుతం 3 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. ప్రాజెక్టుకు 300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా, ప్రస్తుతం 316.40 మీటర్లుగా ఉంది. ఎడమ కాలువకు 520, కుడి కాలువకు 270 క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు


