హైదరాబాద్: 28°C
తెలంగాణ

మార్నింగ్ వాక్ లో పాల్గొన్న రాకేష్ రెడ్డి

MHBD: ఉమ్మడి వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల BRS పార్టీ MLC అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి గురువారం ఉదయం పట్టణంలో పర్యటించారు. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతు కవిత, పలువురు ముఖ్యనేతలతో కలిసి ఆయన మార్నింగ్ వాక్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారం నిర్వహించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. MLC ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలని కోరారు.