CTR: శాంతిపురం మండలం చెంగుబళ్ల పంచాయతీ శెట్టిబళ్లలో సామాజిక భవనం వినియోగానికి దూరమై.. దుస్థితికి చేరువవుతోంది. స్థానికంగా మహిళా సంఘాల సమావేశాలు, ఇతర సామాజిక అవసరాల కోసం నిర్మించిన భవనం అలంకారప్రాయంగా మారింది. ఏళ్ల తరబడి మూతపడిన భవనం చుట్టూ పిచ్చిమొక్కలు, పాదలతో విష సర్పాలకు నిలయంగా మారింది. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
వినియోగానికి దూరమై.. దుస్థితికి చేరువై..!


