KMM: టేకులపల్లి మండలం కొత్తతండా గ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి అంగోత్ కాశీరాం (50) అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. ఆయన కొయ్యగూడెం ఓపెన్‌కాస్ట్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
అనారోగ్యంతో సింగరేణి ఉద్యోగి మృతి


