హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేటి నుంచే అనంతగిరి జాతర ఉత్సవాలు షురూ!

వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేటి నుంచి కార్తీకమాస పెద్ద జాతర ప్రారంభం కానుంది. కార్తీకమాసం సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తరలిరానున్నారు. అనంతగిరి కొండల ప్రకృతి అందాల మధ్య వెలసిన ఈ ఆలయం వికారాబాద్ జిల్లాలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా గుర్తింపు పొందింది.