హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రమాదకరంగా మారిన పాఠశాల భవనం

NGKL: వంగూరు మండలం కోనేటిపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. పాఠశాల భవనం పైకప్పుపై చెట్లు మొలవడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. పైకప్పు పెచ్చులూడి కింద పడుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థులు, ఉపాధ్యా యులు భయాందోళనకు గురవుతున్నారు. చెట్ల వేర్లు స్లాబ్‌కి చొచ్చుకెళ్లడం వల్ల భవనం దెబ్బతింటోంది.