హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆనందపురంలో రెండు పంచాయతీలు ఏకగ్రీవం

విశాఖ: ఆనందపురం (M) శిర్లపాలెం, గొట్టిపల్లి గ్రామపంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. శిర్లపాలెం సర్పంచి పదవిని గ్రామస్థులు రూ.35 లక్షలకు కోరాడ గౌరికి అప్పగించారు. గొట్టిపల్లిలో ఇల్లాపు మహేశ్ రూ.68 లక్షలకు వేలంపాటలో పదవిని దక్కించుకున్నారు. బీసీ మహిళకు రిజర్వు కావడంతో ఆయన భార్య రమాదేవి సర్పంచిగా బాధ్యతలు చేపట్టనున్నారు.