హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైస్‌ ఛైర్మన్‌ పీఠంపై బీజేపీ గురి

అన్నమయ్య: మదనపల్లె మున్సిపల్ వైస్‌ ఛైర్మన్‌ పదవి చుట్టూ కూటమి రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పుర ఎన్నికల్లో నలుగురు కౌన్సిలర్లను గెలిపించుకున్న బీజేపీ.. ఇప్పుడు వైస్‌ ఛైర్మన్‌ పదవి తమకే కేటాయించాలని పట్టుబడుతోంది. MPTC, ZPTC ఎన్నికల్లో బీజేపీ పలు స్థానాలను త్యాగం చేసిందని ఆ పార్టీ నాయకులు గుర్తుచేస్తున్నారు. ఐదుగురు కౌన్సిలర్ల బలంతో వైస్‌ ఛైర్మన్‌ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.