హైదరాబాద్: 28°C
తెలంగాణ

బహిరంగ ప్రదేశంలో మద్యం తాగిన ఇద్దరిపై కేసులు

MDCL: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే ఉపేక్షించేది లేదని మేడిపల్లి SHO జలంధర్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం సాయంత్రం చెంగిచర్ల మేకల మండి రోడ్డులో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా బహిరంగంగా మద్యం తాగుతున్న చెంగిచర్లకు చెందిన బుగ్గ మనోజ్, దర్శనం శ్రీకాంత్‌లను గుర్తించి ఈ-పెట్టీ కేసులు నమోదు చేశారు.