హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లాలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నేడు మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ జయంతి వేడుకలను నిర్వహించనున్నామని ముడా ఛైర్మన్ లక్ష్మణ్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. వేడుకలకు జిల్లా ప్రధాన నాయకులు హాజరు అవుతారన్నారు. 10 గంటలకు నిర్వహించబోయే ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలన్నారు.