హైదరాబాద్: 28°C
తెలంగాణ

టూ టౌన్ పోలీస్ ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్

మహబూబ్‌నగర్ జిల్లా రెండవ పట్టణ సిఐ ఏజాజుద్దీన్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ.. వివిధ వ్యాపార సముదాయాల యజమానులు పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాలని, అలాగే చిరు వ్యాపారులు కూడా రోడ్లను ఆక్రమించి వ్యాపారం చేయకూడదన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌కి అంతరాయం కలిగించకుండా ముందుకు సాగాలని సూచించారు.