హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఈ నెల 30 వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంచాలి'

ADB: ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు దృష్ట్యా రేషన్ కార్డుదారులు ఈ-కేవైసీ చేసుకోవాల్సి ఉన్నందున ఈ నెల 30 వరకు చౌకధర దుకాణాలను తెరిచి ఉంచాలని అదనపు కలెక్టర్ చిత్రు డీలర్లను కోరారు. బుధవారం తన ఛాంబర్‌లో డీలర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశమై మాట్లాడారు. కార్యక్రమంలో డీఎస్ఓ నందిని, డీలర్ల సంఘం అధ్యక్షులు వేణుగోపాల్, మూస, హరీంద్ర, తదితరులు ఉన్నారు.