హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

31 మంది నామపత్రాలు ఉపసంహరణ

GNTR: మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా బుధవారం 31 మంది నామపత్రాలు ఉపసంహరించినట్లు కమిషనర్ అలీంబాషా తెలిపారు. 62 డివిజన్లలో 509 మంది నామపత్రాలు సమర్పించారు. వాటిలో పరిశీలన అనంతరం 338 మిగిలాయి. ఇందులో 31 మంది నామపత్రాలను బుధవారం ఉపసంహరిం చుకున్నారు. సీపీఐ 1, సీపీఎం 1, తెదేపా 20, వైకాపా 2, జనసేన 6, స్వతంత్రులు ఒక్కరు చొప్పున - నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.