హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండో విడత పంచాయతీ ఎన్నికలు.. తొలిరోజు 1,131 నామినేషన్లు

KDP: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా 13 మండలాల్లో తొలిరోజు 366 సర్పంచ్, 765 వార్డు సభ్యుల నామినేషన్లు దాఖలయ్యాయని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. మొత్తంగా తొలిరోజు 1,131 నామినేషన్లు వచ్చాయని వెల్లడించారు. ఈ నెల 20 వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుందన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.