హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ బంగారం విక్రయించి రూ.8 లక్షల మోసం

వరంగల్‌లో నకిలీ బంగారం విక్రయించి రూ.8 లక్షలు మోసం చేసిన వ్యక్తిపై మట్టెవాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కర్ణాటకకు చెందిన ఆనంద్ అనే వ్యక్తి తక్కువ ధరకు బంగారం ఇస్తానని నమ్మించి, మధుకర్ నుంచి రూ.8 లక్షలు తీసుకుని 150గ్రాముల బంగారు బిస్కెట్లు ఇచ్చాడు. వాటిని పరిశీలించగా నకిలీవని తేలడంతో బాధితుడు బుధవారం పోలీసులకు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.