MLG: రామప్ప చెరువులో 32 అడుగుల నీటి నిల్వతో ముంపునకు గురవుతున్న తమ వ్యవసాయ భూములకు నష్టపరిహారం చెల్లించాలని ములుగు మండలం ఇంచర్ల రైతులు కోరారు. రామప్ప–లక్నవరం అనుసంధాన కాల్వ భూసేకరణపై నిర్వహించిన గ్రామసభలో తహసీల్దార్ విజయభాస్కర్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. భూములపై ఆధారపడి జీవిస్తున్న తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ
'రామప్ప ముంపు భూములకు పరిహారం ఇవ్వాలి'


