SKLM: ఆమదాలవలస మండలంలోని 13 మంది MPTC సభ్యుల ప్రమాణస్వీకారం గురువారం మండల పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించనున్నట్లు MPDO వైకుంఠరావు తెలిపారు. ముందుగా మండల కో-ఆప్షన్ సభ్యుల నామినేషన్ల ప్రక్రియ ఉంటుందని, ఏకగ్రీవం కాకపోతే చేతులెత్తి ఎన్నుకునే విధానం ద్వారా ఎంపిక చేస్తామన్నారు. MPP, వైస్ MPP పదవులకు ఎన్నిక నిర్వహించి, ప్రమాణస్వీకారం చేస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎంపీటీసీ సభ్యుల ప్రమాణస్వీకారం


