హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటి దొంగతనం కేసులో ఇద్దరికి జైలు శిక్ష

KKD: కరప మండలం వేములవాడ గ్రామంలో 2019లో జరిగిన ఇంటి దొంగతనం కేసులో బుధవారం ఇద్దరు నిందితులకు న్యాయస్థానం జైలు శిక్ష, జరిమానా విధించింది. నేరం రుజువు కావడంతో నిందితులు పాలిక సాయిరాంకు నాలుగేళ్ల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా, పాలిక వెంకటలక్ష్మికి రెండేళ్ల జైలు శిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ కాకినాడ ఎస్‌జేఎఫ్‌సీఎం కోర్టు న్యాయమూర్తి మాధవి తీర్పు చెప్పారు.