హైదరాబాద్: 28°C
తెలంగాణ

చలి తీవ్రతతో వాతావరణంలో మార్పులు

ASF: కొన్ని రోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. పగటిపూట ఎండ, రాత్రి వేళ చలి పంజా విసురుతోంది. భిన్నమైన వాతావరణంతో జిల్లావాసులు అవస్థలు పడుతున్నారు. చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఓవైపు జలుబు, దగ్గు వేధిస్తుండగా, దీర్ఘకాలిక రోగులకు ఇబ్బందులు తప్పని పరిస్థితి కొనసాగుతోంది.