హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదు'

E.G: ఎన్నికల సమయంలో పోలీసుల అండతో టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ బుధవారం ఆరోపించారు. ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదని, మరో రెండేళ్లలో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని వ్యాఖ్యానించారు. నిబంధనలు ఉల్లంఘిస్తూ టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్న పోలీసు అధికారులకు తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన గుణపాఠం చెబుతామన్నారు.