హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

అనకాపల్లి: ఆర్డీఎస్ఎస్ పనులు, తుఫాన్ నేపథ్యంలో చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా గురువారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఈఈ వెంకటరమణ తెలిపారు. రావికమతం, కొత్తకోట, నాయుడుపాలెం, పీటర్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.