హైదరాబాద్: 28°C
తెలంగాణ

దుమ్ముతో ఉక్కిరిబిక్కిరి.. వాహనదారుల అవస్థలు

VKB: తాండూరు మండలం ఐనెల్లి నుంచి గౌతాపూర్ వెళ్లే రహదారిపై దుమ్ము విపరీతంగా లేస్తుండటంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు వెళ్లిన ప్రతిసారీ దుమ్ము కమ్ముకోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అధికారులు నీళ్లు చల్లడంతోపాటు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు.