హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెక్‌పోస్టులో డీఎస్పీ ఆకస్మిక తనిఖీలు

SRPT: కోదాడ మండలం రామాపురం చెక్‌పోస్టును బుధవారం సాయంత్రం కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాలను క్షుణ్ణంగా పరిశీలించి గంజాయి, అక్రమ మద్యం రవాణాను అడ్డుకోవాలని సిబ్బందికి సూచించారు. అనుమానాస్పద వాహనాలపై నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.