GDWL: సన్నబియ్యం కౌంటర్ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి స్వామి కుమార్ అన్నారు. అయిజ పట్టణంలోని ఈశ్వర్ రైస్ మిల్లులో బుధవారం మిల్లు యజమాని తేజతో కలిసి కౌంటర్ ప్రారంభించారు. బీపీటీ రకం రూ. 66, తెలంగాణ సోనా రూ.74, జేఎస్ఆర్ రూ.79 కేజీ చొప్పున విక్రయిస్తారని తెలిపారు. ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఈ కౌంటర్ ఏర్పాటు చేశామన్నారు.
తెలంగాణ
'సన్న బియ్యం కౌంటర్ సద్వినియోగం చేసుకోండి'


