SRCL: వేములవాడ అర్బన్ మండలం సంకెపల్లిలో మంజూరైన 26 చేయూత పెన్షన్ల పత్రాలను సర్పంచ్ రెడ్డవేణి పరశురాము బుధవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో లబ్ధిదారులకు పంపిణీ చేశారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందేలా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ పండుగ శంకర్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
తెలంగాణ
26 మందికి చేయూత పెన్షన్ల పత్రాల పంపిణీ


