హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విశాఖలో కంట్రోల్ రూమ్‌లు, పునరావాస కేంద్రాలు

విశాఖ: అక్వాన్ తుఫాన్ నేపథ్యంలో విశాఖలో GVMC 11 కంట్రోల్ రూమ్‌లు, 55 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి హై అలర్ట్ ప్రకటించింది. సహాయక చర్యల కోసం 30 జేసీబీలు, 70 టిప్పర్లు, 30 మినీ ఎక్స్‌కవేటర్లు, 98 ర్యాపిడ్ రెస్పాన్స్ బృందాలను సిద్ధం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర సహాయం కోసం 180042500009 నంబర్‌ను సంప్రదించాలని అదనపు కమిషనర్ వర్మ సూచించారు.