పారిశుద్ధ్య నిర్వహణలో బృహన్ ముంబై కార్పొరేషన్ తీరుపై బాంబే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వీఐపీలు వచ్చినప్పుడే పైపై చర్యలు చేపడుతున్నారని అసహనం వ్యక్తం చేసింది. ముంబై వాసుల కోసం నిత్యం వీధులను ఎందుకు శుభ్రంగా ఉంచరని ప్రశ్నించింది. ఇటీవల బ్రిటన్ యువరాజు పర్యటనను పరోక్షంగా ప్రస్తావించింది. కాలుష్య సమస్యకు శాశ్వత పరిష్కారం చూడాలని కోర్టు సూచించింది.
వార్తలు
వీఐపీలు వస్తేనే క్లీన్ చేస్తారా?: హైకోర్టు


