హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశా తిరువూరు మండలం కాకర్ల, రామన్నపాలెం, లక్ష్మీపురం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, తేమశాతం పరీక్షించే యంత్రాలను తనిఖీ చేశారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు.