హైదరాబాద్: 28°C
తెలంగాణ

నాటుసారా పట్టివేత.. ఒకరిపై కేసు

BHPL: గర్మిళ్లపల్లిలో అక్రమంగా నాటుసారా విక్రయిస్తున్న సామల లచ్చవ్వ (70)ను పోలీసులు పట్టుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ.2 వేల విలువైన 5 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. పెట్రోలింగ్ సమయంలో అందిన సమాచారంతో పోలీసులు తనిఖీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ అమూల్య తెలిపారు.