KMM: చింతకాని మండలం తుమ్మలమ్మ చెరువు కట్ట వద్ద బుధవారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి 1 కిలో 65 గ్రాముల ఎండు గంజాయి, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు SI జి. నరేశ్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.53,250 ఉంటుందని తెలిపారు.
తెలంగాణ
గంజాయి స్వాధీనం ఐదుగురి అరెస్ట్


