హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీపీఆర్‌పై అవగాహనతో ప్రాణాలు కాపాడొచ్చు: కలెక్టర్

PDPL: ఆపద సమయంలో విలువైన ప్రాణాలను కాపాడేందుకు సీపీఆర్‌పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో సింగరేణి వైద్య కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు కలెక్టర్‌ను కలిసి ఈనెల 21న నిర్వహించనున్న మెగా సీపీఆర్ శిక్షణ కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.