BHNG: జిల్లా కేంద్ర ఆస్పత్రి మార్చురీ వద్ద మృతదేహాలను దహనం చేసిన ఘటన బుధవారం కలకలం రేపింది. ఘటనాస్థలంలో పుర్రెలు, ఎముకలు బయటపడటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలు ఎవరివి? దహన ప్రక్రియలో నిబంధనలు పాటించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై కలెక్టర్, వైద్యాధికారులు సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
మార్చురీ వద్ద మృతదేహాల దహనం


