హైదరాబాద్: 28°C
తెలంగాణ

పన్నుల పెంపుపై BRS ర్యాలీకి పిలుపు

ములుగు మున్సిపాలిటీలో పెంచిన ఇంటి, వాణిజ్య పన్నులను తగ్గించాలని కోరుతూ గురువారం (19న) బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టనున్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేయనున్నట్లు పార్టీ మండల మాజీ అధ్యక్షుడు సానికొమ్ము రమేష్ రెడ్డి తెలిపారు. కార్యక్రమానికి నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు, వ్యాపారులు తరలిరావాలని పిలుపునిచ్చారు.