హైదరాబాద్: 28°C
తెలంగాణ

'స్థానిక ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు కల్పించాలి'

KNR: స్థానిక ఉత్పత్తులను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసేలా రైతులు, వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని అదనపు కలెక్టర్ డా. అశ్విని వాకడే తనాజీ సూచించారు. బుధవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో డీజీఎఫ్‌టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ-కామర్స్ సమ్మిట్‌ను ప్రారంభించారు. మామిడి, బియ్యం, పసుపు, వెండి ఫిలిగ్రీ, చేనేత, గ్రానైట్ ఉత్పత్తులకు మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు.