SDPT: జగదేవ్‌పూర్ మండలం ఇటిక్యాలలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో మెట్టు ప్రవీణ్ (24) ఆత్మహత్య చేసుకున్నాడు. సొంతింటి నిర్మాణం కోసం అప్పులు చేయగా, వాటిని తిరిగి చెల్లించలేక మనస్తాపానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
తెలంగాణ
అప్పుల బాధతో యువకుడి బలవన్మరణం


