హైదరాబాద్: 28°C
తెలంగాణ

విజేతలకు రాష్ట్రస్థాయి పోటీలకు అవకాశం

ములుగు గిరిజన భవన్‌లో బుధవారం నిర్వహించిన జిల్లా స్థాయి జాతీయ యువజనోత్సవం–2026 విజయవంతమైంది. జిల్లా యువజన, క్రీడలశాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో 150 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. జానపద నృత్యాలు, గీతాలు, చిత్రలేఖనం, కవితారచన, వీధినాటకాలలో ప్రతిభ చాటారు. ములుగు,బండారుపల్లి,జాకారం, వెంకటాపూర్ విద్యార్థులు వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచారు.