VKB: పరిగి మున్సిపల్ పరిధిలోని తుంకులగడ్డ గేటు సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణ
బైక్ అదుపుతప్పి వ్యక్తికి తీవ్ర గాయాలు


