MHBD: కొత్తగూడ, గంగారం మండలాల్లో మంత్రి సీతక్క బుధవారం పర్యటించారు. లబ్ధిదారులకు చేయూత పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తలసేమియా బాధితులతో పాటు గీత, నేత కార్మికులకు కూడా పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
2 మండలాల్లో మంత్రి సీతక్క పర్యటన


