హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతుల అందజేత

ఆసిఫాబాద్ జిల్లాలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల విజేతలకు ఎస్పీ నితికా పంత్ బుధవారం బహుమతులు అందజేశారు. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక బాధ్యత పెంపొందించడమే వ్యాసరచన పోటీల లక్ష్యమని అన్నారు. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు.