హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెండు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు

WNP: పెద్దమందడి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పామిరెడ్డిపల్లి, దొడగుంటపల్లి గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్సన్ ఇన్‌చార్జి చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని సరిగ్గా తూర్పట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, సంఘం డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.