NGKL: వంగూరు మండలం చింతపల్లి సర్పంచ్ రాంభీష్మ ఆదర్శంగా నిలిచారు. గ్రామాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న పంచాయతీ సిబ్బందిని ప్రోత్సహించేందుకు తన రెండు నెలల జీతాన్ని బోనస్‌గా అందజేశారు. పారిశుద్ధ్యం, పంచాయతీ నిర్వహణ, ప్రజలకు సేవలందించడంలో సిబ్బంది కృషిని గుర్తించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
తెలంగాణ
సిబ్బందికి జీతం బోనస్‌గా ఇచ్చిన సర్పంచ్


